చనిపోయిన వ్యక్తి యొక్క పాన్ కార్డ్ ఈ విధంగా పొందొచ్చు.

కానీ కొంతమంది పెద్దవారికి గాని లేదా మామూలు వయసులో ఉన్న కొన్ని కారణాల వల్ల చనిపోయిన వారికి,
వారి యొక్క ఖాతాలో డబ్బులను తీసుకోవాలన్న లేదా PF అకౌంట్ లో నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలన్న,
లేదా మరి ఇతర కారణాలవల్ల వారికి చనిపోయిన వారి యొక్క పాన్ కార్డు అవసరమైనచో,
ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని వెతుకుతూ ఉంటారు.
దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
చాలా సులువుగా వారి యొక్క పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఒరిజినల్ కార్డును కూడా మనం ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు.
సామాన్యంగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరపాలన్న కచ్చితంగా ప్రతి వ్యక్తికి పాన్ కార్డు తప్పనిసరి.
ప్రస్తుతం 18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరికి కూడా పాన్ కార్డ్ ఎంతో అవసరం.
18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు కూడా వారి యొక్క తల్లితండ్రులు,
వారిపై ఏదైనా ఫిక్స్ డిపాజిట్లు కానీ లేదా ఇతర ఆర్థిక లావాదేవీలు వారిపై ఉంచాలనుకుంటే,
వారికి కూడా మైనర్ పాన్ కార్డు అనేది అప్లై చేయవలసి ఉంటుంది.
ఈ పాన్ కార్డ్ ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు వారికి మాత్రమే అవసరం.
దీనికోసం మనము మొదటగా Income Tax Portalలోకి వెళ్లి,
Instant Pan Card అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి.

పై ఫోటోలో కనబడుతున్నట్లు Check Status/ Download Pan అనే ఆప్షన్ దగ్గర ఉన్న
Continue బటన్ ను నొక్కండి.

తరువాత ఇక్కడున్న ఫోటోలో విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ ను అక్కడ ఎంటర్ చేయండి .

తరువాత Continue నొక్కండి.
అప్పుడు వారి యొక్క ఆధార్ కార్డుకు ఏ పాన్ కార్డ్ లింక్ అయి ఉంటే,
మనకు అక్కడ డౌన్లోడ్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది.
అక్కడి నుంచి మనం పాన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గమనిక: ఇది కేవలం వారు Income Tax Portalల్లో Instant Pan Card అప్లై చేసి ఉంటేనే ఈ విధంగా వస్తుంది.
ఒకవేళ ఇందులో వారు అప్లై చేయకుండా ఉంటే మనం ఇంకో విధంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
అది ఇప్పుడు ఎలాగో చూద్దాం..!
అందుకోసం మనము UTI లేదా NSDL Website నుంచి పాన్ కార్డ్ రీప్రింట్ కి అప్లై చేయాలి.


ఇక్కడ కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
పైన చెప్పిన విధంగా మనకు UTI లేదా NSDL Website రెండిట్లో ఏదో ఒకదాంట్లో మనం అప్లై చేసుకోలేము.
ముందుగా మనము వారి యొక్క పాన్ కార్డు ఏ సర్వీస్ ప్రొవైడర్ వెబ్సైట్లో అప్లై చేశారో తెలుసుకోవాలి.
అంటే NSDL or UTI లోన అనే విషయం తెలుసుకోవాలి.
అది మనకి ఎలా తెలుస్తుందని కంగారు పడాల్సిన అవసరం లేదు.
మొదట ఏదో ఒక వెబ్సైట్లో ఓపెన్ చేయండి.
అక్కడ మీకు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ కార్డ్ నెంబర్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేయగానే,
ఆ సర్వీస్ ప్రొవైడర్ లో మీరు ఎంటర్ చేసిన పాన్ కార్డు వివరాలు ఉన్నట్లయితే Continue అని చూపిస్తుంది.
ఒకవేళ లేకపోతే వేరొక సర్వీస్ ప్రొవైడర్లు మీ కార్డు ఉంది అని అక్కడే చూపించేస్తుంది మనకు అక్కడే లింక్ కూడా ఉంటుంది.
దాన్ని నొక్కగానే వారి యొక్క వెబ్సైట్లోకి వెళ్లడం జరుగుతుంది.
అక్కడ మళ్ళీ మనం పాన్ కార్డు వివరాలు అంటే పాన్ కార్డు నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ పుట్టిన నెల సంవత్సరం ఎంటర్ చేసి,
Next కి వెళ్ళగానే పాన్ కార్డుకు ఏదైతే మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడి లింక్ అయి ఉంటుందో,
దానికి ఓటిపి వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి,
మనము పాన్ కార్డు రీ ప్రింట్ కు అప్లై చేసుకోవచ్చు.
పాన్ కార్డ్ రీ ప్రింట్ కు మనం ₹50/- చెల్లించాల్సి ఉంటుంది.
చెల్లించిన తర్వాత మనకు Acknowledgement వస్తుంది.
తర్వాత వారం రోజుల లోపల మన ఇంటికి కార్డు పోస్టులు వస్తుంది.
మనకి ఒకవేళ వెంటనే E-Pancard కావాలంటే ₹8.26/- పైసలు కట్టినట్లయితే,
వెంటనే E-Pancard డౌన్లోడ్ అవుతుంది.
అలా కూడా మనం చనిపోయిన వారి లేదా అందరి పాన్ కార్డును పొందొచ్చు.
గమనించాలి ఇది పూర్తిగా చట్టవిరుద్ధం కేవలం మీకు అవగాహన కల్పించడానికి కోసం మాత్రమే ఇచ్చిన ఇన్ఫర్మేషన్.
ఎందుకంటే ఒకరు చనిపోయిన తర్వాత వారి యొక్క డాక్యుమెంట్స్ ను మనం వాడకూడదు.
అలా వాడిన యెడల చట్టరీత్యా శిక్షలకు మనం అర్హులవుతాము.