2025 లో అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర కరెక్ట్ గా ఉన్న
ఆధార్ కార్డు లో పేరు మార్చుకోవడం అంత సులభతరం కాదు.
నేను చెప్పిన పద్ధతి పాటిస్తే 100% ఆధార్ కార్డు లో పేరును మార్చుకోవచ్చు.

ఆధార్ వారు రోజురోజుకీ ఆధార్ పై కొత్త నిబంధనలను తీసుకొని వస్తున్నారు.
గతంలో మనం ఆధార్ కార్డులో పేరు ఎన్నిసార్లు అయినా మార్చుకునేందుకు
సరైన పత్రాలు అందించి మార్చుకునేందుకు అవకాశం ఉండేది.
కాలక్రమేనా ఆధార్ కార్డులో పేర్లను ఇష్టానుసారంగా మారుస్తున్నారని,
దీన్ని నియంత్రించేందుకు ఆధార్ వారు పేరు మార్చుకొనుటకు
కేవలం రెండే ఛాన్స్ లను ఇవ్వడం జరిగింది.
ఒక్కసారి మనం ఏదైనా పొరపాటుగా పేరు మార్చుకున్న,
మనం మరొకసారి మనకు పేరును మార్చుకునేందుకు సరైన పత్రాలు సమర్పించి సులువుగా మార్చేందుకు అవకాశం ఉండేది.
ప్రస్తుతం ఇప్పుడు కూడా అలాగే ఉంది కానీ
మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా
మన ఇష్టానుసారంగా పేర్లు మార్చుకునేందుకు అవకాశం లేదు. అది మీకు లిమిట్ ఉన్నా కూడా లేదు.
అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
మామూలుగా మనం పేరు ఎక్కువగా మహిళల్లో మార్చుకునే వారిని చూస్తూ ఉంటాం.
ఎందుకంటే వారు చదువుకునేటప్పుడు తండ్రి గారి ఇంటి పేరు ఉంటుంది.
అలాగే వారికి వివాహం అయిన తర్వాత అత్తగారి ఇంటి పేరు అంటే భర్త ఇంటిపేర్లు పెట్టుకోవాలని చూస్తుంటారు.
అలాంటప్పుడు వారు భర్త యొక్క ఇంటి పేరును వారి యొక్క ఆధార్ కార్డు మార్చుకునేందుకు,
ఆధార్ కార్డులో పేరు మార్పు కోసం ఆధార్ సెంటర్ కు వెళ్తూ ఉంటారు.
దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చి పేరు మార్చుకుంటారు.
అప్పటికి మనకు ఉన్న ఒక్క లిమిట్ కంప్లీట్ అయినట్లే.
కొన్ని రోజుల తర్వాత వారికి ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణం చేత అయిన,
మళ్లీ తిరిగి వారి సర్టిఫికెట్ లో ఉన్న తన తండ్రి ఇంటి పేరుతోనే కావాలని,
మరొక్కసారి ఆధార్ కార్డులో మార్చుకునేందుకు లిమిట్ అనేది అవకాశం ఉంటుంది.
ఇలా రెండుసార్లు మార్చుకునేందుకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టిన గతంలో అవుతున్నాయి.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే?
మీరు చూసుకున్నట్లయితే పాన్ కార్డులో కూడా ఇప్పుడు మనం ఇష్టానుసారంగా పేర్లు మార్చడానికి,
ఇన్కమ్ టాక్స్ వారు కూడా అవకాశం కల్పించడం లేదు.
అలా పేర్లు మార్చాలనుకుంటే ప్రస్తుత కాలంలో అనేక కష్టాలు పడాల్సి వస్తోంది.
కేవలం పేరులో ఉన్న ఒకటి రెండు లెటర్స్ మాత్రం మార్చుకోవడానికి సరైన పత్రాలు ఉంటే మార్పుకు అంగీకరిస్తారు.
అలా కాకుండా పేరునే పూర్తిగా మార్చాలంటే మాత్రం
మీ దగ్గర సరైన పత్రాలు ఉన్నా కూడా ఇన్కమ్ టాక్స్ వారు అంగీకరించడం లేదు.
మీ యొక్క అప్లికేషన్ తిరస్కరిస్తున్నారు.
అలాకాకుండా మీరు కచ్చితంగా పేరు మార్చుకోవాలంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తో పాటు,
ఎవరైనా గవర్నమెంట్ గెజిట్ ఆఫీసర్ దగ్గర నుంచి సర్టిఫికెట్ చేపించాల్సి ఉంటుంది.
అలాగే గెజిట్ ఆఫీసర్ యొక్క గవర్నమెంట్ ఐడి కార్డు జిరాక్స్ కాపీని కచ్చితంగా జత చేయవలసి ఉంటుంది.
ఇలా చేస్తేనే ఇన్కమ్ టాక్స్ వారు మీ యొక్క పేరును మార్పుకు అంగీకరించి పాన్ కార్డ్ అందిస్తారు.
ఇప్పుడు ఆధార్ కూడా అదే బాటలో నడవనుంది.
ఇకనుంచి ఎవరైనా వారి యొక్క పేరులో ఒకటి లేదా రెండు అక్షరాలను తప్పిదాలుగా ఉంటే,
మార్చుకునేందుకు మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఆఫ్ ఐడెంటి(POI) డాక్యుమెంట్స్ ను ఉపయోగించి మార్చుకోవచ్చు.
ఉదాహరణకు:

అలాకాకుండా ఇప్పుడు పేరునే పూర్తిగా మార్చాలంటే
ఆధార్ కార్డులో మీ దగ్గర అన్ని సరైన పత్రాలు ఉన్నా కూడా దాని యాక్సెప్ట్ చేయరు.
అలా అని పాన్ కార్డు మాదిరి గెజిట్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికెట్ చేసినా కూడా అది కూడా యాక్సెప్ట్ చేయరు.
మనము కచ్చితంగా గెజిట్ లెటర్ అనగా రాజపత్రము అనే దానిని కచ్చితంగా అప్లై చేసుకోవలసి ఉంటుంది.
ఇది పొందిన తర్వాతే మీరు ఆధార్ కార్డులో మీరు పేరు అనేది మార్చుకునేందుకు అవకాశం ఆధార్ వారు కల్పిస్తారు. అది కూడా మీకు లిమిట్ ఉంటేనే.
ఉదాహరణకు మీ పేరు Kasaram Divya అయితే
మీ ఆధార్ కార్డులో Kaasaram Divya అని ఉంటే మీ దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉంటే కచ్చితంగా మార్చుకోవచ్చు( లిమిట్ ఉంటేనే).
ఉదాహరణకు:
1. ఓటర్ కార్డ్
2. పాన్ కార్డ్
3. ఇండియన్ పాస్పోర్ట్.
4.

ఇలా కాకుండా మీ పేరు Kasaram Divya బదులుగా Gunakala Divya అని రావాలి అంటే,
పెళ్లయిన వారు 👉🏻 మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది.
పెళ్లి కాని వారు అయితే మీరు కచ్చితంగా గెజిట్ లెటర్ కు (రాజ పత్రము) అప్లై చేయాల్సిందే.
పైన తెలిపిన విధంగా మీరు మీ యొక్క పేరును మార్చుకోవచ్చు.
ఇలా కాకుండా మీరు ఎన్నిసార్లు అప్లై చేసినా అది ఖచ్చితంగా రిజెక్టే అవుతుంది.
పైన తెలిపిన విధంగా అంతా కూడా కేవలం మీకు రెండు సార్లు లేదా ఒక్కసారి
పేరు మార్చుకునేందుకు లిమిట్ ఉన్నవారికి మాత్రమే.
అలాకాకుండా మీకు రెండు సార్లు లిమిట్ పూర్తయిపోయి,
మరొక్కసారి కూడా పేరు మార్చుకునేందుకు మన దగ్గర గెజిట్ ఫామ్ ఉన్నా కూడా,
మీ యొక్క అప్లికేషన్ను తిరస్కరించబడుతుంది.
మీరు మూడోసారి పేరు మార్చుకోవాలి అనుకుంటే అనగా లిమిట్ క్రాస్ అయిన వారు
కచ్చితంగా ఆధార్ ఆర్ వో ఆఫీస్ లో సంప్రదించి వారి యొక్క అంగీకారము తో
మీరు మీ యొక్క పేరును మార్చుకునేందుకు అవకాశం మాత్రమే ఉంది.