PAN కార్డులో పేరు మార్చడం ఎలా?

2025లో పాన్ కార్డ్ పేరు మార్పు చేయడం ఎలా? పూర్తి వివరాలు తెలుగులో

pan ard name change
pan ard name change

భారతదేశంలో పాన్ కార్డ్ (PAN Card) ఒక ముఖ్యమైన గుర్తింపు డాక్యుమెంట్.

ఇంకమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా జారీ చేయబడే ఈ కార్డ్ వ్యక్తిగత మరియు బిజినెస్ సంబంధిత లావాదేవీల్లో,

అలాగే ఇది పన్నుల చెల్లింపు, బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది.

కొన్నిసార్లు పాన్ కార్డు పేరు మార్పు అవసరం వస్తుంది. ఉదాహరణగా:

  • పెళ్లయిన తర్వాత భర్త ఇంటి పేరు మార్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. (ప్రత్యేకించి మహిళలు)
  • స్పెల్లింగ్ (spelling) పొరపాట్లు

    పాన్ కార్డ్‌పై తప్పుగా ముద్రించబడిన పేరు ఉండటం వల్ల సమస్యలు ఎదురవుతాయి. దీనిని సరిచేయడం అవసరం.

  • సర్టిఫికెట్స్ లో పేరుకు భిన్నమైన పేరు పాన్ కార్డులో ఉండటం.

    ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు పత్రాల్లో పేరు ఒకలా ఉండి, పాన్ కార్డులో వేరుగా ఉన్నప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది.

  • పేరులో మార్పులు చేయించుకోవాలనుకునే వ్యక్తిగత కారణాలు.

ఈ పాన్ కార్డ్ (PAN Card)లో మార్పు చేసుకోవడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు మార్గాలు ఉన్నాయి.

పాన్ కార్డ్ పేరు మార్చుకునే విధానం – ఆన్లైన్ & ఆఫ్‌లైన్

పాన్ కార్డ్ పేరు మార్పు చేయడానికి NSDL (Protean) లేదా UTIITSL వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

1. ఆన్లైన్ ద్వారా PAN కార్డు పేరు మార్చడం

ఈ క్రింది స్టెప్స్ పాటించి మీరు మీ పేరు మార్పు చేసుకోవచ్చు:

స్టెప్ 1: NSDL లేదా UTIITSL వెబ్‌సైట్ కి వెళ్ళండి

  • NSDL వెబ్‌సైట్:  https://www.onlineservices.nsdl.com
  • UTIITSL వెబ్‌సైట్: https://www.utiitsl.com

స్టెప్ 2: PAN కార్డ్ చేంజ్ అప్లికేషన్ Form నింపండి

  • వెబ్‌సైట్‌లోకి వెళ్లి “PAN Change Request Form” ను డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా ఆన్లైన్‌లో నింపాలి.
  • పర్సనల్ డిటైల్స్ (వ్యక్తిగత వివరాలు) నమోదు చేయాలి.
  • కొత్త పేరు స్పష్టంగా నమోదు చేయాలి.

స్టెప్ 3: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి

మీ పేరు మార్పు ధృవీకరించేందుకు చిరునామా, గుర్తింపు మరియు ఆధార డాక్యుమెంట్ అవసరం.

అవసరమైన డాక్యుమెంట్:

  • పాత పేరు ఉన్న PAN కార్డ్ ఫోటోకాపీ
  • గుర్తింపు పత్రం (ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి)
  • పేరు మార్పు నోటిఫికేషన్ (గెజిట్ పత్రం – మీకు తెలిసిన గవర్నమెంట్ గెజిట్ ఆఫీసర్ దగ్గర సంతకం కూడా చేపించిన సరిపోతుంది. కానీ ఖచ్చితంగా గెజిట్ ఆఫీసర్ ఐడి కార్డు కూడా అవసరం)
  • వివాహ ధృవీకరణ పత్రం (వివాహం కారణంగా పేరు మారితే) పెళ్లి పత్రిక ఉన్న సరిపోతుంది.
  • SSC, డిగ్రీ సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ (పేరు స్పెల్లింగ్ మార్పు)

 

స్టెప్ 4: ఫీజు చెల్లించాలి

  • భారతదేశంలో నివసిస్తున్న వారికి ₹110
  • విదేశాల్లో నివసించే వారికి ₹1020
  • డెబిట్/క్రెడిట్ కార్డ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.

స్టెప్ 5: అప్లికేషన్ సబ్మిట్ & ట్రాకింగ్

  • సబ్మిట్ చేసిన తర్వాత Acknowledgment Number వస్తుంది.
  • దీని ద్వారా పాన్ అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

 

2. ఆఫ్‌లైన్ ద్వారా PAN పేరు మార్చడం

ఆఫ్‌లైన్ విధానం ద్వారా పేరు మార్చాలంటే, ఈ క్రింది విధంగా చేయాలి.

స్టెప్ 1: లోకల్ ఆథరైజెడ్ పాన్ కార్డ్ సెంటర్ కు (NSDL / UTI )వెళ్లాలి

  • అప్లికేషన్ ఫిల్ చేసి ఫోటోలు అంటించి, సంతకం చేసి పాన్ సెంటర్ వారికి ఇవ్వవలసి ఉంటుంది.
  • వివరాలు సరిగ్గా నింపాలి.మీకు తెలియకపోతే తప్పులు చేయకుండా పాన్ సెంటర్ వారి సహాయం తీసుకోండి.

స్టెప్ 2: అవసరమైన పత్రాలు జత చేయండి

  • పాత పేరు ఉన్న PAN కార్డ్ ఫోటోకాపీ
  • గుర్తింపు పత్రం (ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి)
  • పేరు మార్పు నోటిఫికేషన్ (గెజిట్ పత్రం – మీకు తెలిసిన గవర్నమెంట్ గెజిట్ ఆఫీసర్ దగ్గర సంతకం కూడా చేపించిన సరిపోతుంది. కానీ ఖచ్చితంగా గెజిట్ ఆఫీసర్ ఐడి కార్డు కూడా అవసరం)
  • వివాహ ధృవీకరణ పత్రం (వివాహం కారణంగా పేరు మారితే) పెళ్లి పత్రిక ఉన్న సరిపోతుంది.
  • SSC, డిగ్రీ సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ (పేరు స్పెల్లింగ్ మార్పు)

స్టెప్ 3: ఫీజు చెల్లించి Acknowledgment తీసుకోవాలి

 

పాన్ కార్డు పేరు మారిన తర్వాత ఎంత టైం పడుతుంది?

  • కొత్త పాన్ కార్డు మనకు ఇ-పాన్ కార్డు రూపంలో రెండు మూడు రోజుల్లో ఇ-మెయిల్ కు వస్తుంది.
  • కానీ కరెక్షన్ పాన్ కార్డు మాత్రం మనకు ఇ-పాన్ కార్డు రావడానికి 10 రోజులు నుంచి 15 రోజులు వరకు టైం పడుతుంది.
  • ఇ-పాన్ కార్డ్ మెయిల్ కు వచ్చిన తర్వాత మనకు ఒరిజినల్ పాన్ కార్డు మరో రెండు మూడు రోజుల్లో మన అడ్రస్కు స్పీడ్ పోస్ట్ ద్వారా రావడం జరుగుతుంది.
  • స్టేటస్ ట్రాక్ చేయాలంటే:  
    • NSDL వెబ్‌సైట్‌లో “Track PAN Status” విభాగంలో అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయాలి.
    • UTIITSL ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు UTIITSL Track PAN ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు.

పాన్ కార్డ్ పేరు మార్పు చేయడంలో ముఖ్యమైన సూచనలు

✔️ పేరు మార్పుకు నిజమైన కారణం ఉండాలి
✔️ గెజిట్ నోటిఫికేషన్ తీసుకోవడం ఉత్తమం
✔️ అధికారిక గుర్తింపు పత్రాలలో & పాన్ కార్డులో ఒక్కసారిగా మార్పు చేయడం మంచిది
✔️ పాన్ కార్డ్ పేరు మారిన తర్వాత బ్యాంకుల్లో & ఇతర డాక్యుమెంట్స్‌లోనూ అప్డేట్ చేసుకోవాలి

మీకు మా సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా

మీరు నాకు నేరుగా Callme4 App ద్వారా కాల్ చేయవచ్చు.
I’d: yokshas@cm4

Leave a Comment